BAN vs NED: షకీబ్‌ అల్ హసన్ హాఫ్ సెంచరీ.. నెదర్లాండ్స్‌ లక్ష్యం 160

టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌ డిలో బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Updated : 13 Jun 2024 22:08 IST

కింగ్స్‌టౌన్: టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా గ్రూప్‌ డిలో బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64*; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. తాంజిద్ హసన్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్మదుల్లా (25; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. నజ్ముల్ హొస్సెన్ శాంటో (1), లిట్టన్ దాస్ (1), హృదయ్ తౌహిద్‌ (9) నిరాశపరిచారు. జాకేర్ అలీ (14; 7 బంతుల్లో 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, వాన్ మీకెరన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. టిమ్ ప్రింగిల్‌కు ఒక వికెట్ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని