Ban vs Ind Live Updates: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియాపై బంగ్లాదేశ్ విజయం
Bangladesh vs India ODI Updates: భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించింది. భారత్‌దే మ్యాచ్ అనుకుంటున్న సమయంలో మెహిదీ హసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేశాడు.
టీమ్ఇండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించిది. బంగ్లా బ్యాటర్లలో లిటాన్ దాస్ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే బుధవారం (డిసెంబర్ 7) జరగనుంది.
తొమ్మిదో వికెట్
బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన 39.3 బంతికి హసన్ మహ్మూద్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 41 ఓవర్లకు బంగ్లా స్కోరు 154/9.
రెండు వికెట్లు
బంగ్లాదేశ్ మరోసారి స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ సేన్ వేసిన 38.2 ఓవర్‌కు హొస్సెన్ (6) బౌండరీ లైన్ వద్ద సిరాజ్‌కు చిక్కాడు. వన్డేల్లో కుల్దీప్ సేన్‌కి ఇది మొదటి వికెట్. ఇదే ఓవర్లో ఐదో బంతికి ఎబాదత్ (0) హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. 39 ఓవర్లకు బంగ్లాదేశ్ 135/8.
ఏడో వికెట్
బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ వేసిన 38.2 ఓవర్‌కు హొస్సెన్ (6) బౌండరీ లైన్ వద్ద సిరాజ్‌కు చిక్కాడు. వన్డేల్లో కుల్దీప్ సేన్‌కి ఇది మొదటి వికెట్.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు
బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 34.5 ఓవర్‌కు మహ్మదుల్లా (14) వికెట్ల ముందు దొరికిపోగా.. సిరాజ్ వేసిన 35.1 ఓవర్‌కు ముష్పికర్ రహీమ్ (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.36 ఓవర్లకు బంగ్లాదేశ్ 128/6 స్కోరుతో ఉంది. హసన్ మిరాజ్ (0), హొస్సెన్ (0) క్రీజులో ఉన్నారు.
నిలకడగా బ్యాటింగ్
బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. చివరి ఐదు ఓవర్లలో 19 పరుగులు రాబట్టారు. 30 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 116/4గా ఉంది. మహ్మదుల్లా (11), ముష్పికర్ రహీమ్ (14) క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
బంగ్లాదేశ్‌కు భారీ షాక్! షాబాజ్ అహ్మద్ వేసిన 23 ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన షకీబ్ అల్ హసన్ (29) ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 23.3 ఓవర్‌కు విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో షకీబ్ పెవిలియన్ చేరాడు. దీంతో 95 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 25 ఓవర్లో పరుగులేమీ రాలేదు. 25 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ స్కోరు 97/4. ముష్పికర్ రహీమ్ (6), మహ్మదుల్లా (1) క్రీజులో ఉన్నారు.
లిటన్ దాస్ ఔట్
దూకుడు ఆడుతున్న లిటన్ దాస్ (41; 63 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. 19.2 ఓవర్‌కు దాస్ కీపర్ కేఎల్ రాహుల్‌కి చిక్కాడు. దీంతో 74 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లకు బంగ్లాదేశ్ 77/3 స్కోరుతో ఉంది. షకీబ్ అల్ హసన్ (14), ముష్పికర్ రహీమ్ (2) క్రీజులోఉన్నారు.
క్రమంగా జోరు పెంచుతున్న బంగ్లా బ్యాటర్లు
బంగ్లా బ్యాటర్లు క్రమంగా జోరు పెంచుతున్నారు. దీపక్ చాహర్ వేసిన 11 ఓవర్లో ఒక పరుగు రాగా.. కొత్త కుర్రాడు కుల్దీప్ సేన్ వేసిన 12 ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ వికెట్ కోసం (ఎల్బీడబ్ల్యూ) అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత్ డీఆర్ఎస్ కోరింది. అయితే, ఫలితం టీమ్ఇండియాకు అనుకూలంగా రాలేదు. కుల్దీప్ సేన్ వేసిన 14 ఓవర్లో లిటన్ దాస్ ఏడు పరుగులు రాబట్టాడు. 14 ఓవర్లకు బంగ్లాదేశ్ 48/2 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (22), షకీబ్ అల్ హసన్ (7) క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్
బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ వేసిన 9.1 ఓవర్‌కు అనాముల్ హక్ (14) వాషింగ్టన్ సుందర్‌కి చిక్కాడు. 10 ఓవర్లకు బంగ్లాదేశ్ 30/2 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (11), షకీబ్ హల్ అసన్ (4) క్రీజులో ఉన్నారు.
కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడానికి బంగ్లాదేశ్ బ్యాటర్లు కష్టపడుతున్నారు. రెండు నుంచి నాలుగు ఓవర్ల మధ్య 10 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో దీపక్ చాహర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. 5 ఓవర్లకు బంగ్లాదేశ్ 15/1 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (4), అనాముల్ హక్ (11) క్రీజులో ఉన్నారు.
మొదటి బంతికే వికెట్
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. దీపక్‌చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే నజ్ముల్ హొస్సేన్ (0) రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్ 5/1 స్కోరుతో ఉంది. లిటన్ దాస్ (0), అనాముల్ హక్ (5) క్రీజులో ఉన్నారు.
టీమ్ఇండియా 186 ఆలౌట్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హల్ అసన్ 5, హొస్సెన్ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు డౌన్..
భారత్ స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. షకీబ్ వేసిన 33వ ఓవర్ మూడో బంతికి వాషింగ్టన్ సుందర్ (19) ఎబాదత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్(2) కూడా 35 ఓవర్ తొలి బంతికి షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి దీపక్ చాహర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో అర్ధ శతకంతో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్ అర్ద శతకం..
బంగ్లాతో తొలి వన్డేలో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధ శతకం సాధించాడు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన రాహుల్.. ఆ తర్వాత వేగం పెంచాడు. మొత్తం 49 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో సుందర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
బంగ్లాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఎబాదత్ వేసిన 20వ ఓవర్ చివరి బంతికి నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (24) ముష్ఫికర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడుతున్న రాహుల్, అయ్యర్..
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆచూతూచి ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ 16, కేఎల్ రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.
వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..
భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షకీబ్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ రోహిత్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో బంతికే కోహ్లీ(9) లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
తొలి వన్డేలో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. మెహిదీ హసన్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి ధావన్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కింగ్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.
నెమ్మదిగా ఆడుతోన్న ఓపెనర్లు..
బంగ్లాతో తొలి వన్డేలో భారత ఓపెనర్లు నెమ్మదిగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12), ధావన్(7) పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ బ్యాటింగ్ ప్రారంభం..
తొలి వన్డేలో రోహిత్ సేన టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. బంగ్లా వైపు ముస్తాఫిజుర్ బౌలింగ్ ఎటాక్‌కు దిగాడు.
బంగ్లా జట్టు : లిటన్ దాస్(కెప్టెన్), అనాముల్ హక్, నజ్ముల్ హొస్సేన్, షకిబ్, ముష్ఫికర్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మూద్, ముస్తాఫిజుర్, ఎబాదత్ హొస్సేన్.
కుల్దీప్ అరంగేట్రం..
ఈ మ్యాచ్‌తో వన్డేల్లోకి కుల్దీప్ సేన్ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ అతడికి టీమ్ఇండియా క్యాప్ ఇచ్చి ప్రోత్సహించాడు.
భారత జట్టు ఇదే..
ఢాకా : భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఈ సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.
ఢాకా : బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమ్ఇండియా సిద్ధమైంది. రోహిత్ సారథ్యంలోని భారత్.. ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఢీకొనబోతోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన భారత్.. ఈ పర్యటనలో పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించుతోంది. కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లి, రాహుల్ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. పొట్టి కప్పులో పేలవ ఫామ్‌తో విమర్శలెదుర్కొన్న రోహిత్, రాహుల్ బంగ్లాపై చెలరేగిపోతారేమో చూడాలి. భారత తుది జట్టు కూర్పు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి క్రమంగా ఎదుగుతూ పెద్ద జట్లను తరచుగా ఓడిస్తున్న బంగ్లాను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?