T20 World Cup: రాణించిన బౌలర్లు.. నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ విజయం

టీ20 ప్రపంచకప్‌లోనెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాగింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 134 పరుగులే చేసింది. 

Updated : 13 Jun 2024 23:57 IST

కింగ్స్‌టౌన్‌: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌ డిలో నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితం అయింది. సైబ్రాండ్‌ ఎంగెల్‌బ్రెచ్‌ (33) టాప్‌ స్కోరర్‌. విక్రమ్‌జిత్‌ సింగ్‌ (26), స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (25) ఫర్వాలేదనిపించారు. కీలక సమయంలో నెదర్లాండ్స్‌ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. బంగ్లా బౌలర్లలో రషీద్‌ హొస్సెన్‌ 3, తస్కిన్‌ అహ్మద్‌ 2, ముస్తాఫిజుర్‌, తంజిమ్‌ హసన్‌, మహ్మదుల్లా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌ రెండు విజయాలతో సూపర్‌-8 రేసులో ముందుకెళ్లింది. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64*; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. తాంజిద్ హసన్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్మదుల్లా (25; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. నజ్ముల్ హొస్సెన్ శాంటో (1), లిట్టన్ దాస్ (1), హృదయ్ తౌహిద్‌ (9) నిరాశపరిచారు. జాకేర్ అలీ (14; 7 బంతుల్లో 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, వాన్ మీకెరన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. టిమ్ ప్రింగిల్‌కు ఒక వికెట్ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని