IND vs PAK : ఈ సారి వర్షం పాక్‌ను రక్షించింది : బాబర్ సేనపై అక్తర్ విమర్శలు
దాయాదితో సూపర్ 4 మ్యాచ్(IND vs PAK)లో పాక్ పేస్ అటాక్‌ను టీమ్‌ఇండియా సమర్థంగా ఎదుర్కొంది. వారి బౌలింగ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్లు అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్ : చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్(IND vs PAK) మధ్య ఆసియా కప్ (Asia Cup 2023) సూపర్-4 మ్యాచ్(Super 4 match )కు నిన్న వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఎక్కడైతే ఆట నిలిచిందో అక్కడి నుంచి నేడు మ్యాచ్ కొనసాగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొని.. టీమ్‌ఇండియా ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే.. పాక్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్(Babar Azam) సేనపై విరుచుకుపడ్డాడు.
దాయాదుల పోరుకు మళ్లీ వరుణుడి బ్రేక్
లీగ్ స్టేజ్‌లో వర్షం భారత్‌కు అనుకూలంగా మారితే.. సూపర్ 4 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ దాడి నుంచి వరుణుడు పాక్‌ను రక్షించాడని అక్తర్ ఎద్దేవా చేశాడు. ‘నేను మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వచ్చాను. భారత్-పాక్ అభిమానులంతా మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతకు మందు మ్యాచ్‌లో వరుణుడు భారత్‌ను కాపాడాడు. ఈ రోజు వర్షం మమ్మల్ని రక్షించింది’ అంటూ అక్తర్ ఎక్స్(ట్విటర్)లో వీడియో పంచుకున్నాడు.
దాయాదుల మధ్య జరిగిన లీగ్ పోరులో మాదిరిగా.. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. భారత ఓపెనర్లు వారిని అలవోకగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58), రోహిత్ శర్మ (56) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. విరాట్ కోహ్లి (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు. వర్షం పడే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 147/2తో ఉంది.
పాక్ బౌలర్లు కొత్త బంతిపై ఎక్కువ దృష్టిపెట్టాలి: వకార్
నిన్నటి మ్యాచ్‌లో పాక్ బౌలర్లలో షహీన్ అప్రిది తీరు పేలవంగా ఉందని ఆ దేశ మాజీ సీమర్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ‘‘కొత్త బంతితో షహీన్ నిరాశపర్చాడు. పాక్ జట్టులో ఏ బౌలరు షార్ట్‌బాల్స్, బౌన్సర్లకు ప్రయత్నించలేదు. మరో ఎండ్ నుంచి నసీమ్ స్వింగ్‌ను రాబట్టాడు. అదే మీరు సరైన ప్రదేశాల్లో బంతిని సంధిస్తే బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టేవారు. షహీన్ గత మ్యాచ్‌లో బాగా ఆలోచించి బౌలింగ్ చేశాడు. దీంతో అద్భుతమైన 10 ఓవర్లు లభించాయి. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం కొత్త బంతితో పేలవంగా బౌలింగ్ చేసి బౌండరీలు సమర్పించుకొన్నాడు’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
-
USA vs China: ‘తప్పుడు సమాచారం’పై.. అమెరికా-చైనా మాటల యుద్ధం
-
Social Look: దీపికా పదుకొణె ‘కోల్డ్ మీల్’.. శ్రీనిధి శెట్టి ‘ఈఫిల్ టవర్’ పిక్!
-
Manipur : మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ