Rashid Khan : ఎందుకో మరి.. నా బౌలింగ్‌లో బ్యాటర్లు రిస్క్‌ చేయట్లేదు: రషీద్‌ ఖాన్

 టీ20 లీగ్‌లో గత సీజన్లతో పోలిస్తే ఈసారి వికెట్లు తీయకపోయినా....

Published : 13 Apr 2022 01:09 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు ఎక్కువగా వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రించడంలో టాప్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ విజయవంతమయ్యాడు. దీని వెనుక కారణం ఏంటో రషీద్‌ వెల్లడించాడు. ‘‘బ్యాటర్లు నా బౌలింగ్‌లో హిట్టింగే చేసేందుకు మొగ్గు చూపడం లేదు. అందుకే ఎక్కువగా వికెట్ల దొరకడం లేదేమో అనిపిస్తుంటుంది. అయితే ఇప్పటివరకు బౌలింగ్‌ పరంగా సంతృప్తిగానే ఉన్నా. నేను ఫలితం పట్టించుకోను. కేవలం బౌలింగ్‌ ఎలా వేస్తున్నానో అనేదానిపైనే దృష్టిసారిస్తా. అందుకే గొప్పగా వేయగలుగుతున్నా. ప్రత్యర్థి బ్యాటర్లు రిస్క్‌ తీసుకుని భారీ షాట్లు కొట్టకుండా ఉంటున్నారు. వారిని అలా అనుమతిస్తే మాత్రం ఎక్కువ వికెట్లు దక్కుతాయి’’ అని చెప్పుకొచ్చాడు. 

నేను ఎప్పుడూ నెమ్మదిగానే ఆరంభిస్తా

మరో వికెట్‌ తీస్తే టీ20 లీగ్‌లో రషీద్‌ ఖాన్‌ ఖాతాలో వందో వికెట్ పడుతుంది. నిన్న హైదరాబాద్‌ మీద కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే (1/28) తీశాడు. మరో వికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీనిపై రషీద్‌ స్పందిస్తూ.. ‘‘ ఒకసారి టీ20 లీగ్‌ గణాంకాలు చూస్తే.. నేనెప్పుడూ స్లో స్టార్టర్‌నే. నెమ్మదిగా ఆరంభించి పుంజుకోవడం నా ప్రత్యేకత. తొలి నాలుగైదు మ్యాచుల్లో 5-6 వికెట్లను మాత్రమే తీస్తుంటా. ఆ తర్వాత స్పీడ్‌ను అందుకుని వికెట్లను పడగొడతా. తప్పకుండా ఆ మ్యాజిక్‌ స్పెల్స్‌ పడే సమయం వస్తుంది’’ అని రషీద్ వివరించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కనీసం ఇంకో 15-20 పరుగులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిలోనూ హైదరాబాద్‌ బ్యాటర్లు అద్భుతంగా ఛేజింగ్‌ చేశారని ప్రశంసించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts