Updated : 15 Feb 2022 06:56 IST

Viral Video: వాహ్‌.. ఇది కదా బదులు తీర్చుకోవడం అంటే!

బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకున్న బ్యాటర్

(Photo: Viral Video Screenshot)

ఇంటర్నెట్ డెస్క్‌: యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఈసీఎల్‌)లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్‌ తనదైన శైలిలో బౌలర్‌పై ప్రతాపం చూపించడమే కాకుండా అంతే దీటుగా బదులు తీర్చుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.? తొలుత టన్‌బ్రిడ్జ్‌ వేల్స్‌ ఆటగాడు మార్కస్‌ ఓరియోర్డన్‌ను ఔట్ చేసిన తర్వాత డ్రూక్స్‌ జట్టు బౌలర్‌ అహ్మద్‌జాయ్‌ తన కుడికాలి బూటును తీసి చెవి దగ్గర పెట్టుకుని ఫోన్‌ మాట్లాడుతూ పెవిలియన్‌కు దారి చూపుతున్నట్లు ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. ఆ సమయంలో నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న క్రిస్‌ విలియమ్స్‌ అనుకోని ఆ ఘటనతో ఆవేశానికి గురయ్యాడు. ఆ తర్వాత బౌలింగ్‌ చేయడానికి వచ్చిన డ్రూక్స్ కెప్టెన్‌ వహిద్‌ అబ్దుల్‌ ఓవర్లో క్రిస్‌ విలియమ్స్‌ వరుసగా రెండు సిక్సులు బాదాడు. అంతటితో ఆగక.. అంతకుముందు అహ్మద్‌జాయ్‌లాగే సంబరాలు చేసుకున్నాడు. తన బ్యాటును చెవి దగ్గర పెట్టుకుని ఫోన్‌ మాట్లాడుతున్నట్లు చేశాడు. ఇంతకు ముందు తబ్రెయిజ్‌ షంసి, డేవ్‌ మహ్మమ్మద్‌ వంటి బౌలర్లు కూడా వికెట్‌ తీసిన తర్వాత ఇదే మాదిరి సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టన్‌బ్రిడ్జ్‌ వెల్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. కెప్టెన్‌ క్రిస్‌ విలియమ్స్‌ (56), అలెక్స్‌ విలియమ్స్ (58) అర్ధ శతకాలతో రాణించారు. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డ్రూక్స్‌ జట్టు 7.2 ఓవర్లో 91 పరుగులకు ఆలౌటైంది. దీంతో టన్ బ్రిడ్జ్‌ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో చోటు చేసుకున్న సరదా సన్నివేశాన్ని మీరూ చూసేయండి.!


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని