BCCI: ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత మహిళా క్రికెట్ జట్టుపై బీసీసీఐ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
దిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టుపై బీసీసీఐ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మ్యాచులకు సంబంధించి పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళలకు వేతనాలను అందించనున్నట్టుగా తెలిపింది. బీసీసీఐ సెక్రెటరీ జయ్షా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
‘‘వివక్షను అధిగమించే విధంగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్లో సమానత్వం అనే కొత్త శకానికి మేం నాంది పలకనున్నాం. పురుష ఆటగాళ్లు అందుకునే వేతనాన్నే ఇకపై బీసీసీఐ మహిళా క్రికెటర్లు సైతం పొందనున్నారు. (టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేకు రూ. 6లక్షలు, టీ20కి రూ. 3లక్షలు) టీమ్ఇండియా మహిళల విషయంలో ఇది నా నిబద్ధత. మాకు మద్దతుగా నిలిచినందుకు అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు. జైహింద్’’ అంటూ జయ్షా తెలిపాడు.
దేశ విదేశాల్లో మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగుతున్న విషయం తెలిసిందే. 2020 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశారు. ఈ నేపథ్యంలో మహిళా క్రికెట్లోనూ భారత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించనున్నట్టు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. తాజాగా సమాన వేతనాల అంశంతో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!