BCCI: టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధతకు తెర

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 04 Dec 2021 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి పలు మార్పులు చేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్‌ 17న జొహనెస్‌ బర్గ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో తొలి టెస్టు కాస్త ఆలస్యం కానుంది. డిసెంబరు 26న సెంచూరియన్‌ వేదికగా మొదటి టెస్టు ప్రారంభమవుతుంది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లు టీమ్‌ఇండియా పర్యటనపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది. మిగతా మ్యాచుల నిర్వహణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీ20 మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని