BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
బీసీసీఐ తాజాగా ఆటగాళ్ల వార్షిక వేతనానికి సంబంధించి కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గాయాలతో దూరమైన ఇటీవలే జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా ‘ఎ+’ కేటగిరిలోకి దూసుకొచ్చాడు.
ముంబయి: గాయాలతో జట్టుకు దూరమై ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్‌తో జట్టులోకి వచ్చి అదరగొట్టిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీసీసీఐ(BCCI) ప్రకటించిన వార్షిక వేతన కాంట్రాక్ట్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. 2022-23కు సంబంధించి బీసీసీఐ తాజాగా ఆటగాళ్ల వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీలు ‘ఎ+’, ‘ఎ’, ‘బి’, ‘సి’లుగా విభజించి విడుదల చేసిన కాంట్రాక్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా ‘ఎ+’ కేటగిరిలోనే కొనసాగుతుండగా కొత్తగా రవీంద్ర జడేజా ఈ విభాగంలో చోటుదక్కించుకున్నాడు. అంతకుముందు జడేజా ‘ఎ’ విభాగంలో ఉండేవాడు. ‘ఎ+’ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు ఏటా రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు.
ఇక ‘ఎ’ కేటగిరిలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్‌పటేల్ చోటు దక్కించుకున్నారు. వీరు ఏటా రూ.5 కోట్లు తీసుకోనున్నారు. బీసీసీఐ జాబితాలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ ‘ఎ’ కేటగిరికి ఎగబాకారు. అంతకుముందు హార్దిక్ పాండ్య ‘బి’లో, అక్షర్ పటేల్ ‘సి’ కేటగిరిలో ఉన్నారు. ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌గిల్ ‘బి’ కేటగిరీలో ఉన్నారు. వీరు ఏటా రూ.3 కోట్లు వార్షిక వేతనాన్ని అందుకోనున్నారు. చివరిదైన ‘సి’ కేటగిరీలో మొత్తం 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తదితరులు ఉన్నారు. వీరు ఏటా రూ.1 కోటి వార్షిక వేతనం పొందనున్నారు. ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ తొలిసారిగా బీసీసీఐ వార్షిక వేతన కేటగిరిలో స్థానం సంపాదించుకోవడం విశేషం.
- ‘ఎ+’ కాంట్రాక్ట్ ఆటగాళ్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా
- ‘ఎ’ కాంట్రాక్ట్ ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్‌పటేల్
- ‘బి’ కాంట్రాక్ట్ ఆటగాళ్లు: ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌గిల్
- ‘సి’ కాంట్రాక్ట్ ఆటగాళ్లు: ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
The Lancet: దేశంలో పెరుగుతోన్న షుగర్.. బీపీ బాధితులు!
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్