Team India U19: కుర్రాళ్లకు భారీ నజరానా.. బీసీసీఐ ఎంత ప్రకటించిందంటే?

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రికార్డు స్థాయిలో ఐదోసారి కప్పు గెలిచింది. దీంతో బీసీసీఐ యువ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది...

Published : 06 Feb 2022 07:09 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రికార్డు స్థాయిలో ఐదోసారి కప్పు గెలిచింది. దీంతో బీసీసీఐ యువ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన తుది పోరులో భారత్‌ 4 వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే షా.. ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.40లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లాండ్‌ 189 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని