Team India: వెస్టిండీస్‌తో వన్డే, టీ20లకు భారత జట్ల ప్రకటన

త్వరలో వెస్టిండీస్‌తో స్వదేశంలో  జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సంబంధించి సెలెక్టర్లు ఆటగాళ్లను ప్రకటించారు.

Updated : 27 Jan 2022 00:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో వెస్టిండీస్‌తో స్వదేశంలో  జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సంబంధించి సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఈ సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇక సెలెక్టర్లు స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను వన్డే, టీ20లకు ఎంపిక చేశారు. ఇక చాన్నాళ్ల నుంచి జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న మరో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను టీ20లకు ఎంపిక చేశారు. మరోవైపు ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా వన్డేల్లో చోటు సంపాదించాడు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌కు టీ20లో మాత్రమే స్థానం దక్కింది. ఇక వన్డే, టీ20 సిరీస్‌లో అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఇక కొవిడ్‌ బారిన పడడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన వాషింగ్టన్‌ సుందర్‌ వన్డే, టీ20 జట్లలో చోటు సంపాదించాడు.  ఇక ఈ సిరీస్‌కు పేసర్లు బుమ్రా, షమీలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు.  ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే , టీ20 సిరీస్‌లు ఫిబ్రవరి 20తో ముగియనున్నాయి. ఫిబ్రవరి 6న తొలివన్డే, 9న రెండో వన్డే, 11 మూడో వన్డే జరగనుంది. ఫిబ్రవరి 16న తొలి టీ20, 17న రెండో టీ20, 20న మూడో టీ20 జరగనుంది. 

వన్డే జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకుర్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌

టీ20 జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకుర్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని