Ind vs SL : భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. తొలుత టీ20 సిరీస్‌, అది ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌ ప్రారంభం..

Updated : 15 Feb 2022 18:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. తొలుత టీ20 సిరీస్‌, అది ముగిసిన తర్వాత టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు, మొదట టెస్టు, ఆ తర్వాత టీ20 సిరీస్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా సిరీస్‌ల నిర్వహణలో స్వల్ప మార్పులు చేస్తూ బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 24-27 వరకు టీ20 సిరీస్‌, మార్చి 4-16 వరకు టెస్టు సిరీస్ జరగనుంది. తొలి టీ20 లఖ్‌నవూలో, రెండు, మూడో టీ20 మ్యాచులు ధర్మశాలలో జరుగనున్నాయి. అలాగే, తొలి టెస్టు మొహాలీలో, రెండో డే నైట్ మ్యాచ్‌ బెంగళూరులో జరగనుంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ ముగిసిన వెంటనే.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని