Team India: బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లు.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

2024-25 మధ్య టీమ్‌ఇండియా సీనియర్‌ పురుషుల జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించింది.

Updated : 20 Jun 2024 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్: 2024-25 మధ్య టీమ్‌ఇండియా సీనియర్‌ పురుషుల జట్టు స్వదేశంలో ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో భారత జట్టు పలు సిరీస్‌ల్లో తలపడనుంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌ జట్టు.. భారత పర్యటనకు రానుంది. టీమ్‌ఇండియాతో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. మూడు టెస్టుల కోసం న్యూజిలాండ్ టీమ్‌ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. కొత్త సంవత్సరం (2025)లో ఇంగ్లాండ్ టీమ్‌ భారత్‌కు రానుంది. టీమ్‌ఇండియాతో ఐదు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

బంగ్లాదేశ్‌ టూర్‌ షెడ్యూల్ 

  • తొలి టెస్టు: సెప్టెంబరు 19 - 24 (చెన్నై)
  • రెండో టెస్టు: సెప్టెంబరు 27 - అక్టోబర్ 1 (కాన్పూర్)

మూడు టీ20ల సిరీస్‌ 

  • తొలి టీ20: అక్టోబర్ 6 (ధర్మశాల)
  • రెండో టీ20: అక్టోబర్‌ 9 (దిల్లీ) 
  • మూడో టీ20: అక్టోబర్ 12 (హైదరాబాద్‌) 

న్యూజిలాండ్ టూర్‌ వివరాలు 

  • మొదటి టెస్టు: అక్టోబర్ 16 - 20 (బెంగళూరు)
  • రెండో టెస్టు: అక్టోబరు 24 - 28 (పుణె) 
  • మూడో టెస్టు: నవంబర్ 1 - 5 (ముంబయి) 

ఇంగ్లాండ్ టూర్‌ 

ఐదు టీ20ల సిరీస్‌ 

  • తొలి టీ20: 22 జనవరి 2025 (చెన్నై) 
  • రెండో టీ20: 25 జనవరి 2025 (కోల్‌కతా) 
  • మూడో టీ20: 28 జనవరి 2025 (రాజ్‌కోట్) 
  • నాలుగో టీ20: 31 జనవరి 2025 (పుణె)
  • ఐదో టీ20: 2 ఫిబ్రవరి 2025 (ముంబయి) 

3 వన్డేల సిరీస్ 

  • తొలి వన్డే: 6 ఫిబ్రవరి 2025 (నాగ్‌పూర్)
  • రెండో వన్డే: 9 ఫిబ్రవరి 2025 (కటక్)
  • మూడో వన్డే: 12 ఫిబ్రవరి 2025 (అహ్మదాబాద్)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని