Womens Asia Cup 2023: మహిళల ఆసియా కప్‌ 2023కు భారత్‌ ‘ఏ’ జట్టును ప్రకటించిన బీసీసీఐ

జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్న వుమెన్స్‌ ఆసియా కప్‌ 2023(ACC Emerging Women’s Asia Cup 2023) కోసం బీసీసీఐ(BCCI) జట్టును ప్రకటించింది.

Published : 02 Jun 2023 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో జరగబోయే ఏసీసీ ఎమర్జింగ్‌ వుమెన్స్‌ ఆసియా కప్‌ 2023 (ACC Emerging Women’s Asia Cup 2023) కోసం బీసీసీఐ(BCCI) ఇండియా ‘ఏ’ జట్టును శుక్రవారం ప్రకటించింది. హాంకాంగ్‌లో జూన్‌ 12 నుంచి ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. గ్రూప్‌ ఏలో ఉన్న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో 13న హాంకాంగ్‌తో తలపడనుంది. భారత్‌, హంకాంగ్‌లతోపాటు గ్రూప్‌ ఏలో థాయ్‌లాండ్‌, పాకిస్థాన్‌ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్‌ బీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేషియా, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి.

భారత ఏ జట్టు : శ్వేతా సెహ్రావత్‌(కెప్టెన్‌), సౌమ్య తివారి(వైస్‌ కెప్టెన్‌), త్రిషా గొంగడి, ముస్కాన్‌ మాలిక్‌, శ్రేయాంక పాటిల్‌, కనికా అహుజా, ఉమా ఛెత్రి(వికెట్‌ కీపర్‌), మమతా మడివాలా(వికెట్‌ కీపర్‌), సాధు, ఎస్‌. యశశ్రీ, కశ్వీ గౌతమ్‌, పర్‌శావి చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, బి. అనూష.

హెడ్‌ కోచ్‌ : నూషిన్‌ అల్‌ ఖదీర్‌

భారత్‌ ఆడే మ్యాచ్‌లు : హాంకాంగ్‌ ‘ఏ’ తో (జూన్‌ 13న), థాయ్‌లాండ్‌ ‘ఏ’తో(15 జూన్‌), పాకిస్థాన్‌ ‘ఏ’తో (17 జూన్‌)

ఫైనల్‌ : జూన్‌ 21

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని