Published : 04 Mar 2022 01:36 IST

IPL 2022: ఐపీఎల్‌ భాగస్వామిగా ‘రూపే’.. మూడేళ్లకు ఒప్పందం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. చాలాదేశాల్లో ఈ మెగా టీ20 లీగ్‌కి అభిమానులున్నారు. ఈ కారణంగానే ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ అంతకంతకూ పెరుగుతూ బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఐపీఎల్‌ భాగస్వామ్యం అయ్యేందుకు బడా కార్పొరేట్‌ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థ ‘టాటా’ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. డ్రీమ్‌ 11, అన్‌ అకాడమీ, క్రెడ్‌, అప్స్టాక్స్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, పేటీఎం, సియట్‌ వంటి సంస్థలు ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) ఐపీఎల్‌తో చేతులు కలిపింది. రూపే మూడేళ్ల పాటు ఐపీఎల్‌కు అఫీషియల్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తంతో ఒప్పందం చేసుకుందనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15 సీజన్‌ ప్రారంభం కానుంది. ఇదివరకు టైటిల్‌ టైటిల్ స్పాన్సర్‌గా ‘వివో’ వ్యవహరించగా.. ఈ సీజన్‌ నుంచి ‘టాటా’ లీగ్‌ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

ఐపీఎల్ 2022  సెంట్రల్ స్పాన్సర్స్ 

 • టాటా: టైటిల్ స్పాన్సర్ 
 • డ్రీమ్ 11: అఫీషియల్ పార్ట్‌నర్‌ 
 • అన్ అకాడమీ: అఫీషియల్ పార్ట్‌నర్‌
 • క్రెడ్: అఫీషియల్ పార్ట్‌నర్‌
 • అప్స్టాక్స్: అఫీషియల్ పార్ట్‌నర్‌
 • స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌: అఫీషియల్ పార్ట్‌నర్‌
 • రూపే: అఫీషియల్ పార్ట్‌నర్‌
 • పేటీఎం: అఫీషియల్ అంపైర్ పార్ట్‌నర్‌
 • సియట్: అఫీషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్‌నర్‌
 • స్టార్‌ స్పోర్ట్స్‌: అఫీషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ 
 • డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌: అఫీషియల్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌
Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts