BCCI: బీసీసీఐలో మోగిన ఎన్నికల నగారా.. గంగూలీ బరిలోకి దిగేనా..?

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)లో ఎన్నికల సీజన్‌ వచ్చేసింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవుల ఎన్నిక కోసం...

Published : 26 Sep 2022 02:05 IST

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)లో ఎన్నికల సీజన్‌ వచ్చేసింది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్ల పదవుల ఎన్నిక కోసం షెడ్యూల్‌ విడుదలైంది.  ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నోటిఫికేషన్‌ను పంపింది. బీసీసీఐ నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేందుకు దరఖాస్తు దాఖలుకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు గడువునిచ్చింది. అక్టోబర్‌ 5వ తేదీన డ్రాఫ్ట్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌ను ప్రకటిస్తారు. అభ్యంతరాలను అక్టోబరు 6-7 తేదీల్లో సమర్పించాలి. అక్టోబర్‌ 10వ తేదీన అభ్యంతరాలను పరిశీలించి ఎలక్టోరల్‌ రోల్‌ తుది జాబితాను విడుదల చేస్తారు. 

ఇక బీసీసీఐలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు వీరిని ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో బీసీసీఐలోని కీలక పదవులకు పోటీ పడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల దరఖాస్తులను 13వ తేదీ స్క్రూటినీ చేసి.. అదే రోజు అర్హులైన అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ గడువు కాగా.. పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడిస్తారు. 18వ తేదీ ఎన్నిక నిర్వహించి.. అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శిగా జయ్‌ షా ఉన్నారు. గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. జయ్‌ షా బీసీసీఐ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఉంది. అలా కానిపక్షంలో మరోసారి గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపడితే జయ్‌ షా కార్యదర్శిగా బరిలోకి దిగుతారు. వరుసగా రెండుసార్లు బీసీసీఐ పదవులను చేపట్టవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని