Wriddiman Saha: సాహా ఆరోపణలపై విచారణ కమిటీ నివేదికను సమీక్షించనున్న బీసీసీఐ.!

టీమిండియా సీనియర్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఏప్రిల్ 23న సమీక్షించనుంది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు జర్నలిస్ట్‌ బొరియా..

Published : 12 Apr 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా సీనియర్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఏప్రిల్ 23న సమీక్షించనుంది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు జర్నలిస్ట్‌ బొరియా మజుందార్ తనను బెదిరించాడని సాహా గత ఫిబ్రవరిలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాహా ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, ట్రెజరర్‌ అరుణ్ ధూమల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌ ప్రభుతేజ్‌ భాటియాలతో బీసీసీఐ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన దర్యాప్తు నివేదికను అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో సమీక్షించి.. తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. 

గత నెలలో కమిటీ ముందు విచారణకు హాజరైన వృద్ధిమాన్ సాహా, జర్నలిస్ట్ బొరియా మజుందార్ తమ వెర్షన్‌లను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్‌ తనను బెదిరించాడని సాహా పేర్కొన్నాడు. మరోవైపు సాహా వాట్సప్‌ చాట్‌ను తారుమారు చేసి తీసిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని మజుందార్ ఆరోపించాడు. దీంతో వివాదం మరి కాస్త ముదిరినట్లయింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సాహా.. ఇప్పటి వరకు 40 టెస్టులు, 9 వన్డే మ్యాచులు ఆడాడు. గత కొన్నేళ్లుగా జట్టులో రిజర్వ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని