IND vs PAK : కఠిన పరిస్థితుల్లోనూ సంయమనంతో ఆడారు: గంగూలీ

ఉత్కంఠపోరులో పాకిస్థాన్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ క్రమంలో...

Published : 29 Aug 2022 15:44 IST

పాక్‌పై విజయం సాధించిన టీమ్‌ఇండియాకు అభినందనలు

ఇంటర్నెట్ డెస్క్‌: ఉత్కంఠపోరులో పాకిస్థాన్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ క్రమంలో భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ ఆటగాళ్లను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘‘ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. కఠినమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు సంయమనంతో ఆడారు’’ అని ట్విటర్‌లో గంగూలీ పోస్టు చేశాడు. తొలుత పాక్‌ 147 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమ్‌ఇండియా ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో గత టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి తాజాగా భారత్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. 

గంగూలీ చేసిన ట్వీట్‌ను బీసీసీఐ రీట్వీట్‌ చేసింది. అలానే 2018లో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగానే గాయపడి స్ట్రెచర్‌పై మైదానం వీడిన క్షణాలను రవీంద్ర జడేజాతో హార్దిక్‌ గుర్తు చేసుకున్న వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. ‘‘నాకు ఇప్పటికీ గుర్తుంది. 2018 ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఇదే వేదికగా గాయపడ్డా. స్ట్రెచర్‌పై తీసుకెళ్లడం నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ నాకు అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకున్నా’’ అని హార్దిక్‌ తెలిపాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వీడియోను మాత్రం బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని