IND vs AUS : ఇందౌర్‌ పిచ్‌కు ‘పూర్‌’ రేటింగ్‌.. బీసీసీఐ అప్పీల్‌ చేసే అవకాశం..!

గతంలో రావల్పిండి పిచ్‌కు ఐసీసీ(ICC) డీమెరిట్‌ పాయింట్లు కేటాయిస్తే.. పీసీబీ(PCB) ఆ నిర్ణయంపై అప్పీల్‌ చేసి విజయం సాధించింది. మరి ఇప్పుడు ఇందౌర్‌ పిచ్‌‌(Indore Pitch) పేలవమంటూ ఐసీసీ ఇచ్చిన రేటింగ్‌పై బీసీసీఐ(BCCI) కూడా అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 07 Mar 2023 23:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border - Gavaskar Trophy) నేపథ్యంలో పిచ్‌లపై చర్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టు(IND vs AUS)ల్లో విజయాలు నమోదు చేసిన భారత్‌(Team India) మూడో టెస్టులో ఎదురుదెబ్బ తినింది. దీనికి ఇందౌర్‌ పిచ్‌(Indore Pitch) వేదికైంది. ఈ పిచ్‌ను ఐసీసీ(ICC) ‘పేలవం’(Poor)గా పేర్కొని మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. ఐసీసీ వైఖరిపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ(BCCI) అప్పీల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు సమాచారం. ఐసీసీ నియమాల ప్రకారం.. అప్పీల్‌ చేసేందుకు 14 రోజుల సమయం ఉంటుంది. ఒక పిచ్‌కు ఐదేళ్లలో మొత్తం ఐదు డీమెరిట్‌ పాయింట్లు వస్తే.. ఆ స్టేడియంపై ఒక ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా సస్పెన్షన్‌ వేటు పడుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అప్పీల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది పాక్‌లోని రావల్పిండి పిచ్‌కు ఐసీసీ యావరేజ్‌ కంటే తక్కువ రేటింగ్‌ ఇస్తే.. పీసీబీ(PCB) అప్పీల్‌ చేసి విజయం సాధించింది. ఆ పిచ్‌కు ఐసీసీ ఇచ్చిన డీమెరిట్‌ పాయింట్లను వెనక్కి తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని