BCCI: ఆ నిర్ణయం సానుకూలంగా రాకపోతే బీసీసీఐకి రూ. 950 కోట్లు నష్టం!
కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకొనే ఒక నిర్ణయం బీసీసీఐకి కోట్ల నష్టం తెప్పించే అవకాశ ఉంది. సానుకూలంగా నిర్ణయం వస్తే మాత్రం భారీ ఆదాయం వచ్చినట్లే. అందుకోసం బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే భారత క్రికెట్ బోర్డుకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చే దేశాల బోర్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాల్సి ఉంటుంది. బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఐసీసీ పొందే ఆదాయంపై 21.84 శాతం సర్ఛార్జ్ విధించాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే మాత్రం బీసీసీఐ దాదాపు రూ. 950 కోట్లను కోల్పోయే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.
భారత్‌లో ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఇలాంటి మినహాయింపులు ఇచ్చేందుకు ఆస్కారం లేదు. మినహాయింపు పొందలేకపోతే బీసీసీఐ తన వాటాలో కొంత మొత్తం ఐసీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలాగే 2016 ఐసీసీ టీ20 ప్రపంచకకప్ నిర్వహణ సందర్భంగానూ బీసీసీఐ దాదాపు రూ. 193 కోట్లను నష్టపోయింది. మరోసారి భారీగా కోల్పోవడం ఇష్టంలేని బీసీసీఐ ఈ అంశంపై ఐసీసీ ట్రెబ్యునల్‌లో సవాల్ చేసింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతోనూ చర్చలు జరుపుతోంది. సర్ఛార్జ్ పర్సెంటేజీని 10 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల కనీసం సగమైనా బీసీసీఐకి మిగిలే అవకాశం ఉంటుంది. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రసారాల ద్వారా దాదాపు రూ. 4,300 కోట్లను ఆదాయం వస్తుందని ఐసీసీ అంచనా వేసింది. అందులో 21.84 శాతం సర్ఛార్జ్ చెల్లించాల్సి వస్తే.. దానిని బీసీసీఐ వాటా నుంచి ఐసీసీ కట్ చేసుకొనే ప్రమాదం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు