
Virat Kohli - BCCI: కోహ్లీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన బీసీసీఐ... ఏమందంటే?
ఇంటర్నెట్ డెస్క్: బుధవారం ఉదయం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బీసీసీఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలను బీసీసీఐ కొట్టి పారేసింది. వన్డే ఫార్మాట్ నాయకత్వ మార్పునకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లీతో చర్చించాడని వెల్లడించింది.
‘విరాట్ కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సమయంలోనే అతడితో చర్చలు జరిపాం. మా ఆలోచనతో ఏకీభవించని కోహ్లీ.. టీ20 పగ్గాలను వదులుకునేందుకే సిద్ధపడ్డాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. జట్టులో సమన్వయం లోపిస్తుందని బీసీసీఐ భావించింది. దీంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ కోహ్లీతో ముందుగానే చర్చించాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, గతంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ మార్పు గురించి రెండు రోజుల ముందే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.