The Hundredలో ఆడడానికి BCCI అనుమతి 

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో నలుగురు టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లకు ఆడడానికి బీసీసీఐ అనుమతులిచ్చింది...

Published : 04 May 2021 23:57 IST

నలుగురు మహిళా క్రికెటర్లకు ఎన్‌వోసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో నలుగురు టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లకు ఆడడానికి బీసీసీఐ అనుమతులిచ్చింది. అందులో ఓపెనర్‌ స్మృతి మంధాన, టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. ఇక నాలుగో క్రికెటర్‌ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వీరు అక్కడ ‘వంద బంతుల టోర్నీ’లో ఆడేందుకు పూర్తి అనుమతులిచ్చినట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు చెప్పారు. కాగా, ఈ నలుగురు ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ పూర్తయ్యాక ఇంగ్లాండ్‌లోనే ఉండనున్నారు. జూన్‌ 16 నుంచి జులై 15 వరకు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ జట్టుతో పలు సిరీస్‌లు ఆడనుంది. కాగా, ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ అనేది వంద బంతుల టోర్నీ. గతేడాదే ఇంగ్లాండ్‌ బోర్డు ఈ టోర్నీని నిర్వహించాలని భావించినా కరోనా వైరస్‌ కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో నిర్వహించాలని భావించింది. అందులో నలుగురు భారత క్రికెటర్లకు అవకాశం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని