బీసీసీఐకి తలనొప్పి! తెగదెంపులకు సిద్ధమైన వివో?
బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి! ఐపీఎల్-2020పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. టైటిల్ స్పాన్సర్ ‘వివో ఇండియా’ బోర్డుతో తెగదెంపులు చేసుకొనేందుకు సిద్ధమైందని సమాచారం. వీలైతే పూర్తి కాలానికి లేదా కనీసం ఈ సీజన్‌కైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఫలితంగా...
చైనీస్ స్పాన్సర్‌పై వ్యతిరేకతే కారణం
ఏం చేయాలో పాలుపోని స్థితిలో బోర్డు!
బీసీసీఐకి మరో కొత్త తలనొప్పి! ఐపీఎల్-2020పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. టైటిల్ స్పాన్సర్ ‘వివో ఇండియా’ బోర్డుతో తెగదెంపులు చేసుకొనేందుకు సిద్ధమైందని సమాచారం. వీలైతే పూర్తి కాలానికి లేదా కనీసం ఈ సీజన్‌కైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఫలితంగా బోర్డుకు ఏం చేయాలో? సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి.
అసలేమైంది?
సాధారణంగా మార్చిలో ఐపీఎల్ మొదలవ్వాలి. కరోనా వైరస్ మహమ్మారి ముప్పుతో నిరవధికంగా వాయిదా వేశారు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఆసియాకప్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా వేయడం కలిసొచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో లీగ్ నిర్వహణకు విండో దొరికింది. భారత్‌లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేదికను యూఏఈకి మారుస్తున్నట్టు ఐపీఎల్ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్ 19న మొదలై నవంబర్ 10న టోర్నీ ముగుస్తుందని వెల్లడించింది. టైటిల్ స్పాన్సర్‌గా ‘వివో ఇండియా’నే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత మొదలైంది.
యాప్‌ల నిషేధంతో రచ్చ!
గల్వాన్ లోయలో చైనీయులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అటువైపు 45 మంది వరకు హతమయ్యారని సమాచారం. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగాయి. దుందుడుకు చైనా ఆట కట్టించేందుకు భారత్ వివిధ అస్త్రాలను ప్రయోగించింది. ఇందులో భాగంగానే భారతీయుల సమాచారం తస్కరణ, సార్వభౌమత్వానికి భంగం కలుగుతోందని టిక్‌టాక్, హెలో సహా అనేక యాప్‌లను నిషేధించింది. విడతల వారీగా నిషేధిత యాప్‌లను ప్రకటిస్తోంది. అలాంటప్పుడు చైనాకు చెందిన వివో స్పాన్సర్‌షిప్‌ను ఎలా కొనసాగిస్తారని సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాండ్ పేరు దెబ్బతింటుందని భావించిన వివో స్పాన్సర్షిప్ నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకుందని తెలిసింది.
కొత్త స్పాన్సర్ దొరికేనా?
వివోతో వివాదం ఎలా సర్దుకుంటుందోనని బీసీసీఐ భయపడుతోంది. మధ్యవర్తి ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిసింది. వివో 2017లో ఐదేళ్ల కాలానికి రూ.2199 కోట్లతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ పొందింది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా వైదొలగితే మరో కొత్త స్పాన్సర్ దొరుకుతారా? ఇంతే సొమ్ము చెల్లించగలరా అని బోర్డు ఆవేదన. కరోనా విపత్కర కాలంలో రూ.440 కోట్లలో సగం ధరకైనా మరొకరు దొరికితే గొప్పేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యూఏఈలో నిర్వహిస్తే తాము నష్టపోయే గేట్‌మనీ పరిహారం చెల్లించాలని కొన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే డిమాండ్ చేస్తుండటమూ బోర్డును కలవరపెడుతోంది.
మధ్యలో మరొకరు!
ఇప్పటికే ఇబ్బందుల్లో పడిన బీసీసీఐకి మరొకరు పక్కలో బల్లెంలా మారారు! యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బోర్డుకు అనుమతించొద్దని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జయశంకర్‌కు అఖిల భారత వ్యాపారుల సంఘం (సీఏఐటీ) లేఖ రాసిందని తెలిసింది. చైనా స్పాన్సర్‌తో తెగదెంపులు చేసుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా వస్తువుల విక్రయానికి వ్యతిరేకంగా సీఏఐటి పోరాడుతోంది. కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్‌ను వాయిదా వేయగా లేనిది ఐపీఎల్ ఎందుకని ప్రశ్నించారని తెలిసింది. ఇలాంటి వివాదాల నడుమ ఐపీఎల్ నిర్వహణ అంత సులభమైతే కాదు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‌తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్‌ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్‌ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. -
IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి.. -
Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్-కెప్టెన్’ రోహిత్ ఏం చేస్తాడో?
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. -
Rajasthan vs Lucknow: లఖ్‌నవూతో మ్యాచ్.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?
సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్ - లఖ్‌నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి. -
Cricket News: ఈసారైనా.. టైటిల్ కల నెరవేరేనా?
ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. తొలి ఎడిషన్ నుంచి ఆడుతున్న మూడు జట్లు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేకపోయాయి. -
Pat Cummins: కెప్టెన్ మారాడు.. హైదరాబాద్ కథ మారేనా?
కెప్టెన్ మార్పు జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్లో సన్‌రైజర్స్ కథ సరికొత్తగా మొదలవుతుందా? నేడు కోల్‌కతాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
CSK vs RCB: ధోనీ పాత్ర ఏంటి..? ఆర్సీబీ వ్యూహమేంటి?
చెపాక్ వేదికగా సీఎస్కే-ఆర్సీబీ (CSK vs RCB) జట్ల మధ్య ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. -
IPL 2024: ఐపీఎల్లో ఎవరు బెస్ట్..? ఎందుకు?.. ‘గూగుల్ జెమిని’ ఏం చెప్పిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యుత్తమ ప్లేయర్ల జాబితాను తీస్తే కొందరు ఉంటారు. అయితే.. గూగుల్ జెమిని ఏం చెప్పిందో తెలుసుకోండి.. -
IPL: ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్‌లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. -
IPL 2024: ఓవర్లో రెండు బౌన్సర్లు.. కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీఎల్
ఐపీఎల్ 17వ సీజన్‌ను (IPL 2024) మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. -
IPL 2024: ఐపీఎల్ టాప్ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!
ఐపీఎల్ (IPL) సందడి మొదలుకానుంది. అభిమానులకు క్రికెట్ మజాతోపాటు క్రికెటర్లు తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునేందుకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. -
IPL 2024: అందరి కళ్లూ వీరి పైనే.. ‘అన్క్యాప్డ్ ప్లేయర్ల’కు అవకాశం ఇస్తారా?
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండానే.. భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఎలా ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. అలాంటి వారిలో టాప్ ఎవరంటే? -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్‌కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
Rishabh Pant: రిషభ్ పంత్ పటాకా పేలుతుందా?
టీ20లైనా, వన్డేలైనా, టెస్టులైనా.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించే రిషభ్ పంత్ (Rihabh Pant) మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. -
Virat Kohli: విరాట్ ఎదుట ఒక టోర్నీ.. టార్గెట్లు చాలా!
తన బ్యాటింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చెప్పడానికి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అద్భుతమైన వేదిక. అతడిపై రేకెత్తిన పలు సందేహాలను ఈ టోర్నీలో పటాపంచలు చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. -
Rohit Sharma: కెప్టెన్సీ లేని రోహిత్.. కోహ్లీలా రెచ్చిపోతాడా?
రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఐపీఎల్ (IPL 2024) సీజన్లో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని అతడు.. తిరిగి బ్యాటింగ్‌లో ఒకప్పటి దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.