Sourav Ganguly: ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జి.. రెండు వారాలు హోం ఐసోలేషన్‌లోనే!

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆస్పత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జి..

Published : 31 Dec 2021 16:08 IST

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడిన గంగూలీ సోమవారం రాత్రి కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఒమిక్రాన్‌ పరీక్షలు కూడా నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యంగానే ఉన్నారని, హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు.  ‘ఈ మధ్యాహ్నం గంగూలీని డిశ్చార్జి చేశాం. మరో రెండు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉండనున్నారు. ఆ తర్వాత తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.  గంగూలీకి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 49 ఏళ్ల గంగూలీకి ఈ ఏడాది యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు