BCCI: సెలక్షన్‌ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. కొత్త సెలక్టర్ల కోసం ప్రకటన

బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

Published : 18 Nov 2022 22:25 IST

దిల్లీ: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే కొత్త సెలక్టర్ల కోసం దరఖాస్తుల కోరుతూ శుక్రవారం రాత్రి ట్వీట్‌ చేసింది. సెలక్షన్‌ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టంచేసింది. నవంబర్‌ 28 సాయంత్రం 6గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు