BCCI - Virat: విరాట్ యో-యో టెస్టు స్కోరు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్వీట్‌వార్నింగ్!
యో - యో టెస్టు (Yo Yo Test) ఫలితాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది. దీంతో బీసీసీఐ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) సన్నద్ధతలో భాగంగా జట్టులోకి ఎంపికైన వారి కోసం బీసీసీఐ (BCCI) యో-యో టెస్టును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తప్పనిసరి కాకపోయినా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ (Virat Kohli) సహా పలువురికి టెస్టు ముగిసింది. కోహ్లీ తన టెస్టు స్కోరును సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. యో-యో (Yo Yo Test) టెస్టులో 17.2 స్కోరు వచ్చినట్లు పేర్కొన్నాడు. కనీసం 16.5 స్కోరు నమోదు చేయాలనేది బీసీసీఐ సూచించిన మార్కు. కోహ్లీ చేరుకున్నప్పటికీ.. కొందరు ఆ మార్క్‌ను తాకలేదని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేస్తుందేమోనని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలో ఆటగాళ్లకు కీలక సూచనలు చేసింది. ఎవరూ తమ సామాజిక మాధ్యమాల్లో యో-యో టెస్టు రిజల్ట్స్‌ను పంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Team India: ఇటు ముంబయివాలా.. అటు గుజరాతీ
‘‘సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అధికారిక రహస్య విషయాలను వెల్లడించవద్దు. తమ శిక్షణ సందర్భంగా దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. అదేవిధంగా టెస్టుల స్కోరుకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఇది కాంట్రాక్ట్ క్లాజ్ ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయొద్దని మౌఖింగా ఆదేశాలు ఇచ్చాం’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా.. టీమ్‌ఇండియా (Team India) తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో (IND vs PAK) తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..