BCCI: సెలక్టర్లకు ఉద్వాసన.. చేతన్‌ బృందంపై బీసీసీఐ వేటు

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ముందుగా ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసిన చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీకి బోర్డు ఉద్వాసన పలికింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

Updated : 19 Nov 2022 09:55 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ముందుగా ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసిన చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీకి బోర్డు ఉద్వాసన పలికింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుతో పాటు గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ కూడా చేరలేకపోయిన భారత బృందాన్ని ఎంపిక చేసింది కూడా ఈ కమిటీనే. ఇందులో చేతన్‌తో పాటు హర్విందర్‌ సింగ్‌, సునీల్‌ జోషి, దేబశిష్‌ మొహంతి ఉన్నారు. కొత్త సెలక్షన్‌ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. దీనికి గడువు ఈ నెల 28. త్వరలోనే జట్టులోనూ పెద్ద మార్పులు ఉండబోతున్నాయనడానికి సెలక్షన్‌ కమిటీపై వేటు సూచికగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని