IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. అక్కడ టీమ్‌ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్‌ సెషన్స్‌

టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌ని ఏర్పాటు చేసింది. 

Published : 31 Jan 2023 17:38 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆస్టేలియా (IND vs AUS) మధ్య నాలుగు టెస్టుల సిరీస్ (బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ)కి సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) ఫైనల్‌కు ముందు ఇరుజట్లకు ఇది చివరి సిరీస్‌. ఈ సిరీస్‌ని సాధించి వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలని భారత్‌ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోన్న బీసీసీఐ.. టెస్టు సిరీస్‌కు ముందు నాగ్‌పూర్‌లో టీమ్‌ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌ని నిర్వహించనుంది. 

న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లతోపాటు ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ఫిబ్రవరి 2న నాగ్‌పూర్‌ చేరుకుంటారు. అక్కడ వరుసగా ఐదురోజులపాటు ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొంటారు. అయితే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే విదర్భ క్రికెట్ అసోసియేసన్‌ (వీసీఏ) స్టేడియంలో రెండు సెషన్స్‌ మాత్రమే జరుగుతాయి. మిగతా మూడు సెషన్స్‌ని పాత వీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు.  ‘సిరీస్‌కు ముందు కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు టెస్టు ఆటగాళ్లు నాగ్‌పూర్‌లో కలుస్తారు. అక్కడ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో వారికి క్యాంపు ఉంటుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ జట్టుతో కలుస్తాడు. ఇది ఫిట్‌నెస్ క్యాంప్. కానీ, టెస్టు సిరీస్‌ ఆడటానికి ముందు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని