ప్రతి మూడు రోజులకోసారి కరోనా టెస్టులు.!

 భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రికెటర్ల ఆరోగ్యం పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే ఆటగాళ్లకు ప్రతి మూడు రోజులకు ఓసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Published : 08 Sep 2021 19:52 IST

ఐపీఎల్‌ మిగతా మ్యాచులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం

దుబాయి: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రికెటర్ల ఆరోగ్యం పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే ఆటగాళ్లకు ప్రతి మూడురోజులకు ఓసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకోసం దుబాయికి చెందిన ఓ ఆరోగ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర వైద్య నిపుణులు, ఎయిర్‌ అంబులెన్స్‌, ఇతర సహాయ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనుంది. ఆటగాళ్లు బయో బబుల్‌ నుంచి బయటికి రాకుండా చూసేందుకు పర్యవేక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లలోనే సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించనుంది.   

ముందు జాగ్రత్తగా వంద మంది వైద్య సిబ్బందితో కూడిన రెండు టీములను దుబాయి, ఒమన్‌ దేశాల్లో అందుబాటులో ఉంచింది. మిగతా ఆటగాళ్లు దుబాయి చేరుకునే లోపే.. వారు బస చేయనున్న 14 హోటళ్లలోని 750 మంది సిబ్బందికి కూడా కరోనా టెస్టులు పూర్తి చేయనుంది. ఇప్పటికే పలు ఐపీఎల్‌ జట్లు దుబాయి చేరుకుని క్వారంటెయిన్‌లో ఉన్నాయి. మిగతా సీజన్‌లో మొదట తలపడనున్న ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు ఆగస్టు 13నే పరీక్షలు పూర్తి చేసింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రతి మూడు రోజులకు ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని