
Updated : 24 Nov 2021 07:39 IST
IPL: ఐపీఎల్ జట్లు విదేశాల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడాలి
దిల్లీ: విదేశాల్లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను బీసీసీఐ అనుమతించాల్సిన సమయం ఆసన్నమైందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఈ మ్యాచ్‌ల వల్ల ఐపీఎల్ మరింత బలోపేతమవుతుందని చెప్పాడు. ‘‘సీజన్ లేనప్పుడు భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అనుమతి ఇచ్చే అంశాన్ని బీసీసీఐ పరిశీలించాలి. ఇలా ఆడడం వల్ల ఐపీఎల్ మరింత బలపడుతుంది. ఆటగాళ్ల అందుబాటును బట్టి ఏటా మూడు లేదా అయిదు మ్యాచ్‌లు ఆడొచ్చు’’ అని అన్నాడు. రెండు కొత్త ఫ్రాంఛైజీలకు భారీ ధర పలకడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని చెప్పాడు. లీగ్‌కు ఆ అర్హత ఉందని అన్నాడు.
Tags :