Virat Kohli : విరాట్‌ కోహ్లీ ల్యాండ్‌మార్క్‌ టెస్టుపై.. దిగ్గజ ఆటగాళ్లు ఏమన్నారంటే.!

వందో టెస్టు ఆడనున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. టెస్టు క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకోనున్న కోహ్లీ గురించి, అతడు సాధించిన..

Updated : 03 Mar 2022 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వందో టెస్టు ఆడనున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. టెస్టు క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకోనున్న కోహ్లీ గురించి, అతడు సాధించిన విజయాలు, భారత క్రికెట్‌పై అతడి ప్రభావం తదితర విషయాల గురించి.. పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్ ద్రవిడ్, సౌరభ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌ సింగ్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు.. కోహ్లీపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 28 అర్ధ శతకాలు ఉన్నాయి. మార్చి 4 నుంచి మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగనున్న తొలి టెస్టు అతడికి వందోది కానుంది. దీంతో కోహ్లీ కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలవనుంది. అయితే, తొలుత ఈ మ్యాచ్‌కు కరోనా కారణంగా ప్రేక్షకులను అనుమతించరనే వార్తలు వచ్చినా బీసీసీఐ ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీకి అంగీకరించింది. కానీ, టీమిండియా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

దిగ్గజాల శుభాకాంక్షలు..

* నీ గురించి నేను తొలిసారి విన్నది 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో. అప్పుడు మీరు మలేసియాలో అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడుతున్నారు. అప్పుడే డ్రెస్సింగ్‌ రూమ్‌లో పలువురు ఆటగాళ్లు నీ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆటగాడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. వాడి బ్యాటింగ్‌ చూడాలని చెప్పారు. బరిలోకి దిగి బాగా ఆడు. ఆల్‌ ది బెస్ట్‌.  -సచిన్‌ తెందూల్కర్‌. 

ఒక టెస్టు ఆడటమే గొప్ప. ఇక వంద టెస్టులు ఆడటమనేది ఇంకా గొప్ప ఘనత. ఈ విషయంలో కోహ్లీ సాధించిన దానికి గర్వంగా ఉండొచ్చు. ఆల్‌ ది బెస్ట్‌. వందో టెస్టును ఆస్వాదించు.   -రాహుల్‌ ద్రవిడ్‌.

కోహ్లీ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని అత్యున్నత శిఖరాలకు చేరాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా, టీమ్‌ఇండియా మాజీ సారథిగా, 100 టెస్టుల ఆడిన ఆటగాడిగా అతడికి మనస్ఫూర్తిగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నా.  -సౌరభ్‌ గంగూలీ.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని