Winter Olympics: అట్టహాసంగా మొదలైన వింటర్‌ ఒలింపిక్స్‌

మంచులో మాయచేస్తూ.. అదరహో అనిపించేలా సాగే వింటర్‌ ఒలింపిక్స్‌ శుక్రవారం బీజింగ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి......

Published : 04 Feb 2022 22:32 IST

బీజింగ్‌: మంచులో మాయచేస్తూ.. అదరహో అనిపించేలా సాగే వింటర్‌ ఒలింపిక్స్‌ శుక్రవారం బీజింగ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. చైనా ప్రజలు అదృష్టంగా భావించే పులి చిహ్నంతోపాటు పులి ఆకారం కలిగిన టోపీలు ధరించి చిన్నారులు మొదట పరేడ్‌ నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే 91 దేశాల క్రీడాకారులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణలో చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు నిబంధనల నడుమ ఈ వింటర్‌ ఒలింపిక్స్‌ సాగనున్నాయి. ఈ పోటీలు నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి.

ఈసారి వింటర్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి ఒక అథ్లెట్‌ మాత్రమే అర్హత సాధించాడు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌ స్కీయింగ్‌లో పోటీపడబోతున్నాడు. స్లాలోమ్‌, జెయింట్‌ స్లాలోమ్‌ విభాగాల్లో అతడు బరిలో దిగనున్నాడు. 2002 తర్వాత ఒక్కరే పాల్గొనడం ఇదే తొలిసారి. 1964 నుంచి వింటర్‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత్‌.. ఇప్పటిదాకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది. శివ కేశవన్‌ (లూజ్‌) అత్యధికంగా ఆరుసార్లు ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. చివరిగా జరిగిన 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లోనూ ఇతడే పాల్గొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని