Published : 08/12/2021 13:32 IST

Beijing Olympics: మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌ పరిస్థితి రాదు: ఐవోసీ

బీజింగ్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలోని బీజింగ్‌ వేదికగా శీతాకాల ఒలింపిక్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ప్రపంచంపై కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వైరస్‌ పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ  క్రీడల నిర్వహణపై నీలినీడలు అలముకుంటున్నాయి. అయితే, ఈ విషయంపై అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐవోసీ) స్పందించింది. టోక్యో ఒలింపిక్స్‌లా ఈ శీతాకాల ఒలింపిక్స్‌ వాయిదా పడే పరిస్థితులు రావని వెల్లడించింది. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాక.. ఈ ఏడాది జులైలో నిర్వహించారు.

బీజింగ్‌ శీతాకాల ఒలింపిక్స్‌ నిర్వహణపై ఒలింపిక్‌ గేమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫ్‌ డుబి మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌ను వాయిదా వేసే పరిస్థితులు ఉన్నట్లు తనకు అనిపించట్లేదని చెప్పారు. ‘‘బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్‌ కోసం చైనా అధికారులు ఏర్పాటు చేసిన క్లోజ్డ్ లూప్ సిస్టమ్ చాలా పటిష్ఠమైనది. కొవిడ్‌ విషయంలో చాలా నేర్చుకున్నాం. కరోనా వ్యాపించదని మేం చెప్పట్లేదు. కానీ.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏం చేయాలో పక్కా ప్రణాళికలు.. కార్యాచరణ సిద్ధం చేశాం. మా బృందానికి ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. కాబట్టి ఒలింపిక్స్‌ వాయిదా పడే ప్రసక్తే లేదు’’అని తెలిపారు. శీతాకాల ఒలింపిక్స్‌ విజయవంతమవుతాయని, క్రీడాకారులు సురక్షితంగా ఉంటారని ఐవోసీ హామీ ఇచ్చింది.

మరోవైపు బీజింగ్‌లో 2022న జరగాల్సిన వింటర్‌ ఒలింపిక్స్‌ను ‘దౌత్య బహిష్కరణ’ చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఐవోసీ పేర్కొంది. అయితే, అమెరికా ప్రభుత్వం ఒలింపిక్‌ గేమ్స్‌లో అథ్లెట్లు పాల్గొనే అంశంపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని