Ben stokes: వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి బెన్‌ తిరిగొస్తాడా?

వన్డే ఫార్మాట్‌లో తన రీ ఎంట్రీపై ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతోన్నాయి.

Published : 02 Dec 2022 01:35 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ ఒత్తికి కారణంగా వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, తన నిర్ణయంపై తాజాగా ఈ ఆల్‌రౌండర్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనపడుతోన్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో బెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ఈ ఫార్మాట్‌లో తిరిగి ఆడించే ప్రయత్నాలు జరిగాయని అతడు తెలిపాడు. 

పాకిస్థాన్‌తో టెస్ట్‌ మ్యాచ్ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ప్రపంచకప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం అద్భుతమైన విషయం. కానీ, ప్రస్తుతం నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా దృష్టంతా పాకిస్థాన్‌తో మ్యాచ్ పైనే ఉంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ మ్యానేజింగ్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ కీ నన్ను సంప్రదించాడు. వన్డేల్లోకి అడుగుపెట్టడంపై నాతో మాట్లాడాడు. అయితే, నేను మాత్రం ఆ మాట వినగానే అక్కడి నుంచి దూరంగా వెళ్లాను’’ అని తెలిపాడు. ఇంగ్లాండ్‌ 2019 ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన సందర్భంలో ఈ ఆటగాడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఈ నిర్ణయం ఆటగాళ్లు ఒకేసారి అన్ని ఫార్మట్లలో ఆడాలని ఒత్తిడి చేసే వారికి చెంపపెట్టు లాంటిదని అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని