IPL : ఐపీఎల్‌ వేలం నుంచి స్టోక్స్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ వేలం నుంచి వైదొలిగాడు. పనిభారాన్ని తగ్గించుకోవడానికి, ఇంగ్లాండ్‌ ఆడబోయే సిరీస్‌లకు తాజాగా ఉండేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటిష్‌ మీడియా పేర్కొంది. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 0-4తో ఓడిన సంగతి తెలిసిందే.

Updated : 18 Jan 2022 12:51 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ వేలం నుంచి వైదొలిగాడు. పనిభారాన్ని తగ్గించుకోవడానికి, ఇంగ్లాండ్‌ ఆడబోయే సిరీస్‌లకు తాజాగా ఉండేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటిష్‌ మీడియా పేర్కొంది. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 0-4తో ఓడిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో స్టోక్స్‌ 226 పరుగులే చేశాడు. నాలుగు వికెట్లే పడగొట్టగలిగాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు టీ20 లీగ్‌లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ ఇంగ్లాండ్‌ దిగ్గజ క్రికెటర్లు విమర్శిస్తున్న నేపథ్యంలో స్టోక్స్‌ ఐపీఎల్‌ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో ఉంటే స్టోక్స్‌కు భారీ ధర పలికేదనడంలో సందేహం లేదు. మరోవైపు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కూడా   ఐపీఎల్‌ వేలంలో అడుగుపెట్టే అవకాశాన్ని వదులుకున్నాడు. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్‌ జట్టును గాడినపెట్టడం కోసం అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.   ఐపీఎల్‌లో మెగా వేలంలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రూట్‌ గత వారమే చెప్పాడు.  ‘‘మా జట్టు కోసం చేయాల్సింది చాలా ఉంది. అందుకోసం నా శక్తినంతా ఉపయోగించాల్సిన అవసరముంది. జట్టు కోసం నేను చేయగలిగినంత త్యాగం చేస్తూనే ఉంటా.  ఎందుకంటే నేను టెస్టు క్రికెట్‌ మేలును కోరుకుంటా’’ అని రూట్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని