Ben stokes: ఇంగ్లాండ్‌కు దొరికిన గొప్ప పోరాట యోధుడు.. బెన్‌స్టోక్స్
అతడో మేటి పేసర్.. అత్యవసర సమయాల్లో జట్టుకు అమూల్యమైన వికెట్లు అందిస్తాడు. అతడో సూపర్ బ్యాట్స్‌మన్.. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్‌ను మంత్ర దండంగా మారుస్తాడు...
తన ఆటతో ఆ మాటలకు చెక్ పెట్టాడు..
అతడో మేటి పేసర్.. అత్యవసర సమయాల్లో జట్టుకు అమూల్యమైన వికెట్లు అందిస్తాడు. అతడో సూపర్ బ్యాట్స్‌మన్.. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్‌ను మంత్ర దండంగా మారుస్తాడు. అతడో పోరాట యోధుడు.. అగాధంలో కూరుకుపోయిన జట్టును అసమాన పోరాటంతో గెలిపిస్తాడు. అతడే ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. ఉన్నట్టుండి వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ప్రత్యేక కథనం.
విమర్శించిన వారితోనే శభాష్ అనిపించుకొని..
2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా.. 2019 వరకూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే పలు వివాదాల్లో చిక్కుకొని అభిమానుల్లో చులకనయ్యాడు. తన ప్రవర్తనతో ఒకానొక సందర్భంలో జట్టులో చోటే కోల్పోయాడు. ఇంకోసారి ఏకంగా ఇంగ్లాండ్ జట్టుకు టీ20 ప్రపంచకప్‌నే దూరం చేశాడు. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు సమర్పించుకొని ఇంగ్లాండ్ గెలవాల్సిన మ్యాచ్‌ను వెస్టిండీస్‌కు అప్పగించాడు. దీంతో బెన్‌స్టోక్స్ అంటేనే ఆ జట్టు అభిమానులకు చిర్రెత్తుకొచ్చేది. సీన్ కట్‌చేస్తే 2019 జులై 14. తనని విమర్శించిన వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్‌కు దశాబ్దాల కలను నెరవేర్చాడు. ఆ జట్టుకు హీరో అవ్వడమే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో అతడిలా స్టార్ ఆల్‌రౌండర్ అవ్వాలని ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.
ఆ మాటలకు చెక్ పెట్టాడు..
అప్పటిదాకా ఇంగ్లాండ్‌కు క్రికెట్ పుట్టినిల్లన్న పేరే తప్ప వన్డే ప్రపంచకప్ గెలిచింది లేదు. దీంతో ఆ జట్టును ఎవరైనా విమర్శించాలంటే ఈ అస్త్రాన్నే మాటల తూటాల్లా వినియోగించేవారు. కానీ, వాటికి చెక్ పెట్టేలే చేసిన ఘనత బెన్‌స్టోక్స్‌ది. దశాబ్దాల కలను నెరవేరుస్తూ 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలబెట్టాడు. దీంతో ఆ జట్టుకు దశాబ్దాల వన్డే ప్రపంచకప్ కలను సాకారం చేశాడు. 242 పరుగుల ఛేదనలో 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో బెన్‌స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో 5x4, 2x6) గొప్పగా పోరాడు. బట్లర్ (59; 60 బంతుల్లో 6x4)తో కలిసి ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 241 పరుగులే చేసి ఆలౌటైంది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే, సూపర్ ఓవర్ నిర్వహించగా అక్కడా మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్టోక్స్ అద్వితీయ పోరాటమే ఉత్కంఠభరితమైన క్షణాల్లో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించేలా చేసింది. అంతకుముందు స్టోక్స్ పలు విలువైన ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఈ మ్యాచ్‌తోనే తనపై ఉన్న చెడు అభిప్రాయాలను తొలగించుకున్నాడు.
పోరాట యోధుడు..
బెన్‌స్టోక్స్‌కు ఓ విలక్షణమైన అలవాటుంది. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ గెలుస్తామనే సంకల్పం అతడిది. ఆ లక్షణంతోనే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అదరడు బెదరడు. టాప్‌ఆర్డర్ లేకపోయినా.. లోయర్ ఆర్డర్‌తోనే మ్యాచ్‌లు గెలిపిస్తాడు. ప్రత్యర్థి ఎవరనేది, ఎంత పెద్ద లక్ష్యం అనేవి పట్టించుకోడు. అది 2019 వన్డే ప్రపంచకప్‌లోనే తెలిసొచ్చినా.. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లోనూ మరోసారి నిరూపించుకున్నాడు. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థికి 112 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 246 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఛేదనలో ఇంగ్లాండ్ 286/9తో ఓటమి అంచున నిలిచింది. అప్పటికి ఆ జట్టు విజయానికి 72 పరుగులు కావాలి. చేతిలో ఒకే వికెట్ మిగిలింది. స్టోక్స్ 61 పరుగులతో ఉన్నాడు. చివరి బ్యాట్స్‌మన్‌గా లీచ్ క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్ ఒంటరిపోరాటం చేశాడు. చివరికి 362/9 స్కోర్ సాధించి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. అప్పటికి స్టోక్స్ (135 నాటౌట్‌తో) నిలిస్తే లీచ్ (1) ఒక్క పరుగు మాత్రమే తీశాడు. దీన్నిబట్టి అతడెలాంటి పోరాట యోధుడో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్‌ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్‌ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్‌లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి