Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌కు కేంద్రం సన్మానం.. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుస్తానంటూ ధీమా

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందిన మహిళా బాక్సర్లను కేంద్రం సత్కరించింది. స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌తోపాటు కాంస్యాలతో మెరిసిన......

Published : 24 May 2022 22:38 IST

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందిన మహిళా బాక్సర్లను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌తోపాటు కాంస్యాలతో మెరిసిన ప్రవీణ్‌ హుడా, మనీషా మౌన్‌ను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) సన్మానించాయి. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హాజరై క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులకు కేంద్రం మద్దతిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్‌ను క్రీడల్లో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్‌లో నిఖత్‌ స్వర్ణం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిఖత్‌ మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ ప్రోత్సాహంతోనే ఇక్కడివరకు రాగలిగాను. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తా. 2014లో ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. రాబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని నిఖత్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని