
Delhi: ఓపెనర్ పృథ్వీషాకు అనారోగ్యం.. మిగతా మ్యాచ్‌లకు దూరం
(Photo: Prithvi Shaw Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకున్న సమయంలో.. దిల్లీ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో లీగ్ స్టేజ్‌లో ఆ జట్టు ఆడాల్సిన మిగతా రెండు ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. షా కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆ జట్టు సహాయక కోచ్ షేన్ వాట్సన్ తాజాగా మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆడలేడని చెప్పాడు.
‘షాకు ఏం జరిగిందో నాకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే, కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడెంతో నాణ్యమైన ఆటగాడు. ప్రపంచ శ్రేణి బౌలర్లపై ఆధిపత్యం చలాయించగల బ్యాట్స్‌మన్. అలాంటి ఆటగాడు లేకపోవడం మా జట్టుకు తీరని నష్టం. అతడు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నా. అయితే, లీగ్ స్టేజ్‌లో మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉండడు’ అని వాట్సన్ పేర్కొన్నాడు. అయితే, అతడు టైఫాయిడ్ బారిన పడ్డాడని కెప్టెన్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు.
కాగా, షా ఈ సీజన్‌లో చివరిసారి మే 1న లఖ్‌నవూతో దిల్లీ తలపడిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జ్వరం బారిన పడటంతో.. హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే దిల్లీ ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే, ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో దిల్లీ మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ లాంటి డాషింగ్ ఓపెనర్ మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరమే. ఇక పృథ్వీ ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28.78 సగటుతో 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aaditya Thackeray: పిరికివారే పార్టీని వీడారు.. దమ్ముంటే శివసేనను వీడి పోరాడండి..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Xi Jinping: మూడేళ్ల తర్వాత చైనాను దాటి బయటకు రానున్న షీజిన్‌పింగ్..!
-
General News
AP CRDA: కాసుల కోసం వేట... రాజధానిలో భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
-
Sports News
Ranji Trophy: మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
-
General News
ap cm Jagan: మంచి చేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులే శ్రీరామరక్ష: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!