SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బిగ్ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీకి షాకింగ్‌ న్యూస్. కీలకమైన ఆటగాడిని దూరం చేసుకుంది. తాజాగా దిల్లీతో మ్యాచ్‌లో రాణించిన వాషింగ్టన్ సుందర్‌ గాయం కారణంగా దూరమైనట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రకటించింది.

Updated : 27 Apr 2023 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) షాక్ తగిలింది. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయం కారణంగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కీలక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఎవరిని తీసుకొంటారనే విషయం ఇంకా వెల్లడించలేదు. 

‘వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2023 సీజన్‌ నుంచి వైదొలిగాడు. తొడకండరాల గాయం వల్ల మిగతా మ్యాచ్‌లను ఆడలేనందున విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. సుందర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని సన్‌రైజర్స్‌ ట్వీట్ చేసింది. ఆరేడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే సుందర్‌ ఏడు మ్యాచుల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. మొత్తం 60 పరుగులను చేసిన వాషింగ్టన్ సుందర్.. ఒక్క మ్యాచ్‌లోనే మూడు వికెట్లను మాత్రమే తీశాడు. దిల్లీతో మ్యాచ్‌లో మూడు వికెట్లు, కీలకమైన 24 పరగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. తీరా కీలక సమయంలో జట్టుకు దూరం కావడంతో ప్రభావం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని