Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌.. భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల ప్రయాణం కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. 

Updated : 31 Jul 2022 09:29 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల ప్రయాణం కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికే మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్-10లో నిలిచింది.

రజత పతకం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ బింద్యారాణి దేవీకి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని