Tokyo Olympics: భారత మహిళల హాకీ జట్టుకు ‘చక్‌దే ఇండియా’ కోచ్‌ శుభాకాంక్షలు

టోక్యో ఒలింపిక్స్‌లో అటు పురుషుల హాకీ జట్టు, ఇటు మహిళల హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ చాలా కాలంగా రెండు జట్లూ ఒలింపిక్స్‌లో ఆశించినంత మేర రాణించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే

Published : 02 Aug 2021 23:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో అటు పురుషుల హాకీ జట్టు, ఇటు మహిళల హాకీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ చాలా కాలంగా రెండు జట్లూ ఒలింపిక్స్‌లో ఆశించినంత మేర రాణించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రెండు జట్లూ సెమీస్‌కు చేరడంతో సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల పోస్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, ప్రీతి జింతా, క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి ఆటగాళ్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపించారు. ఈ రెండు జట్లూ సెమీస్‌లో గెలుపొంది స్వర్ణాలతో రావాలని ఆకాంక్షించారు. అయితే, షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘చక్‌దే ఇండియా’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అందులో కబీర్‌ఖాన్‌ అనే పాత్రలో భారత మహిళల హాకీ జట్టుకు ప్రధాన కోచ్‌గా షారుఖ్‌ నటించాడు. ఈ సందర్భంగా ఆ పాత్రను గుర్తుచేసుకుంటూ ఆయన ట్వీట్‌ చేశాడు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు బంగారు పతకం తీసుకురావాలని.. మాజీ కోచ్‌ కబీర్‌ ఖాన్‌ అని పేర్కొంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. ఇక ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు మంగళవారం బెల్జియంతో పోటీపడనుండగా, బుధవారం మహిళల జట్టు ఫైనల్స్‌కు చేరడానికి అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. 





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని