Champioms Trophy: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ప్రపంచ స్థాయి ఆతిథ్యమిస్తాం: రమీజ్‌ రజా

ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్‌ టోర్నమెంట్లకు సంబందించిన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో..

Published : 17 Nov 2021 09:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్‌ టోర్నమెంట్లకు సంబందించిన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో నిర్వహించడం పట్ల పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రజా సంతోషం వ్యక్తం చేశారు. ఆ ట్రోఫీకి ప్రపంచ స్థాయి ఆతిథ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. చివరి సారిగా 1996 వన్డే ప్రపంచకప్‌నకు ఇండియా, శ్రీలంకలతో కలిసి పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చింది. 

‘ఐసీసీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించడం ద్వారా ఐసీసీ మా జట్టు యాజమాన్యంపై పూర్తి విశ్వాసం ప్రదర్శించినట్లయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచ స్థాయి ఆతిథ్యం కల్పిస్తాం. కోట్లాది మంది అభిమానులకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను దగ్గరి నుంచి చూసే అవకాశం దొరికింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్లంతా కలిసి మెలిసి ఆడారు. ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా అలాంటి సుహృద్భావ వాతావరణంలో నిర్వహించేలా చూస్తాం’ అని రమీజ్‌ రజా పేర్కొన్నాడు. 2009 లాహోర్‌లో కొంతమంది ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లపై దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నీలను నిర్వహించడం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు పాక్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించడంపై ఆ దేశ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని