ప్చ్‌.. బోపన్నకు నిరాశ!

ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్‌ మెక్లాహన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న అతడు...

Published : 10 Feb 2021 18:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్‌ మెక్లాహన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న అతడు.. తొలి రౌండ్‌లో సుంగ్‌ నమ్‌-మిన్‌ క్యు జంట చేతిలో 4-6, 6-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. గంట 17 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌లో బోపన్న జోడీ తేలిపోయింది. అయితే రెండో సెట్‌లో ప్రతిఘటించినప్పటికీ ఓటమి తప్పలేదు.

ఠిన క్వారంటైన్‌ నిబంధనల కారణంగా ప్రాక్టీస్‌కు తక్కువ సమయం లభించడం బోపన్న ఆటపై ప్రభావం చూపింది. భారత యువ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. నగాల్‌ 2-6, 5-7, 3-6తో రికార్డాస్‌ బెరాంకీస్‌ (లిథుయేనియా) చేతిలో ఓడాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత ఆటగాళ్లు దివిజ్‌ శరన్‌ (పురుషుల డబుల్స్‌), అంకిత రైనా (మహిళల డబుల్స్‌) పోరాటం మిగిలి ఉంది.

ఇదీ చదవండి
నగాల్‌ ఔట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని