IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్‌ కార్తిక్‌ ప్లేయింగ్‌ XI ఇదే!.. గిల్, కుల్‌దీప్‌కు దక్కని చోటు

భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల (బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ) ప్రారంభంకానుంది. నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ కోసం పలువురు మాజీ క్రికెటర్లు తమ అంచనాతో తుది జట్లను ప్రకటిస్తున్నారు. 

Published : 08 Feb 2023 14:12 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌ గావస్కర్‌- ట్రోఫీ (Border Gavaskar Trophy) ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 9 నుంచే నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకెళ్లాలని భారత్‌, ఆసీస్‌ భావిస్తున్నాయి. దీంతో ఈ ట్రోఫీపై ఇటు ఆటగాళ్లలో, అటు అభిమానుల్లోనూ ఆసక్తి మరింత పెరుగుతోంది. సిరీస్‌లో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత జట్టు (Team India) కూర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లు తొలి టెస్టు కోసం తమ తుది జట్టుని ప్రకటిస్తున్నారు. టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌  (Dinesh Karthik) తన ప్లేయింగ్‌ XIని వెల్లడించాడు. 

రోహిత్‌ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్‌లను డీకే ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాలకు పుజారా, కోహ్లీ (Virat Kohli) లను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు బదులుగా సూర్యకుమార్‌ యాదవ్‌ని తీసుకున్నాడు. ఆరో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌కు బదులు కేఎస్ భరత్ వైపు మొగ్గుచూపాడు. పిచ్‌ స్పిన్‌ అనుకూలంగా ఉంటుందని భావించి ముగ్గురు స్పిన్నర్లకు తన తుది జట్టులో అవకాశం కల్పించాడు డీకే. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకుని కుల్‌దీప్‌ యాదవ్‌ని పక్కన పెట్టాడు. మహమ్మద్‌ సిరాజ్‌, షమిలను పేసర్లుగా తీసుకున్నాడు.

తొలి టెస్టుకు డీకే టీమ్‌ ఇదే..:

రోహిత్‌ శర్మ, పుజారా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‌, అశ్విన్‌,అక్షర్‌ పటేల్, షమి, సిరాజ్‌.

భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా తన తుది జట్టుని ప్రకటించాడు. 

ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ XI:

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్/సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/కుల్‌దీప్ యాదవ్, షమి, సిరాజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు