India vs Srilanka: ‘కుల్చా’కు ఇదో గొప్ప ఛాన్స్‌!

శ్రీలంకతో మూడు వన్డేల్లో కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కాలని టీమ్‌ఇండియా సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మ్‌ణ్‌ అన్నాడు. ఎక్కువ బౌలింగ్‌ చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌లో ఉండాల్సిన...

Published : 10 Jul 2021 01:03 IST

దిల్లీ: శ్రీలంకతో మూడు వన్డేల్లో కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కాలని టీమ్‌ఇండియా సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మ్‌ణ్‌ అన్నాడు. ఎక్కువ బౌలింగ్‌ చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌లో ఉండాల్సిన ఆటగాడని పేర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత కుల్‌దీప్‌, చాహల్‌ ఫామ్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.

‘కుల్‌దీప్‌, చాహల్‌ మూడు వన్డేల్లో ఆడాలని కోరుకుంటున్నా. వన్డేల్లో ప్రతి బౌలర్‌కు పది ఓవర్లు దొరకుతాయి. అంటే ఎంత ఎక్కువ బౌలింగ్‌ చేస్తే వారంత ఎక్కువ విజయవంతం అవుతారు. తిరిగి ఆత్మవిశ్వాసం పొందుతారు.  ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌! ఇక చాహల్‌ విజయవంతమైన బౌలర్‌. మంచి అనుభవం ఉంది. ధీమాగా ఉంటాడు. జట్టులో కీలక సభ్యుడు. టీ20 ప్రపంచకప్‌ అతడి మదిలో ఉండే ఉంటుంది’ అని లక్ష్మణ్ అన్నాడు.

యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాల్సిన ఆటగాడని లక్ష్మణ్‌ అన్నాడు. ‘మూడో స్థానంలో సూర్య కుమార్‌ బ్యాటింగ్‌ చూడటం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అతడు మొదటి షాట్‌ ఆడాడు. అప్పుడు కొట్టిన షాట్‌ అతడిలోని ఆత్మ విశ్వాసాన్ని చూపిస్తోంది. అతడికున్న ప్రతిభ, తెలివితేటలకు ఇదో గొప్ప అవకాశం’ అని తెలిపాడు.

శ్రీలంకపై ఆరు మ్యాచుల్లో సూర్యకుమార్‌ ఆడాలని లక్ష్మణ్‌ కోరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పరుగులు చేస్తూ ఆత్మవిశ్వాసం సాధించాలని, ఎదగాలని కోరుకుంటున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని