IND vs SA: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన..ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్టు.!

సెంచూరియన్ వేదికగా డిసెంబరు 26 నుంచి జరుగనున్న తొలి టెస్టును ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే  నిర్వహించనున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రకాలో కరోనా కేసులు విజృంభిస్తుండటమే ఇందుకు..

Published : 20 Dec 2021 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెంచూరియన్ వేదికగా డిసెంబరు 26 నుంచి జరుగనున్న తొలి టెస్టును ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు! ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల మేరకు.. ఇరు బోర్డుల అధికారులు, కొద్ది మంది క్రికెట్ అభిమానులను మాత్రమే అనుమతించనున్నారు. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి ఇంకా ఐదురోజుల సమయం ఉండటంతో.. ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందేమోనని మ్యాచ్‌ నిర్వాహకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికైతే వచ్చే ఏడాది జనవరి 03 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సంబంధించిన టికెట్లను విక్రయించడం లేదు. ‘దయచేసి గమనించండి. రెండో టెస్టుకు సంబంధించి టికెట్ల విక్రయాలపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తారా?, లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తాం’ అని దక్షిణాఫ్రికా క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియా ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. త్వరలో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఆటగాళ్లు సాధన చేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని