Umesh Yadav: ఉమేశ్‌ యాదవ్‌తో కలిసి ఆడటం నా అదృష్టం: మెక్‌కలమ్‌

కోల్‌కతా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌తో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని ఆ జట్టు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ అన్నాడు. గతరాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ నాలుగు ఓవర్లు...

Updated : 31 Mar 2022 14:46 IST

(Photo: Brendon McCullum Instagram)

ముంబయి: కోల్‌కతా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌తో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని ఆ జట్టు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ అన్నాడు. గతరాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి.. 2 వికెట్లు తీసి 16 పరుగులే ఇచ్చాడు. అంతకుముందు చెన్నైతో తలపడిన తొలి మ్యాచ్‌లోనూ ఈ కోల్‌కతా పేసర్‌ 2 వికెట్లు తీశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన మెక్‌కలమ్‌ ఉమేశ్‌ బౌలింగ్‌పై స్పందించాడు.

‘ఉమేశ్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. నేను క్రికెట్‌ ఆడే రోజుల్లో అతడితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. అతడెంత మంచి బౌలరో నాకు తెలుసు. అతడికి ఎంత నైపుణ్యం ఉందో కూడా తెలుసు. ముఖ్యంగా కొత్త బంతి సహకరిస్తే ఎలా చెలరేగుతాడో తెలుసు. జట్టు కోసం వీలైనంత త్వరగా ఎక్కువ వికెట్లు తీయాలనుకుంటాడు. ఒకవేళ అతడి బౌలింగ్‌లో కొన్ని అదనపు పరుగులు వెళ్లినా మేం పట్టించుకోం. ఎందుకంటే అతడి నుంచి మేం అటాకింగ్‌ బౌలింగే ఆశిస్తున్నాం. ఇక ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మేం ఆశించినదానికన్నా ఎక్కువే చేశాడు. అతడు ఇప్పటి వరకు అద్భుతంగా రాణించాడు. ఇకపైనా ఇలాగే కొనసాగుతాడని ఆశిస్తున్నా. ఇప్పుడు అతడి కెరీర్‌ చరమాంకంలో ఉందని తెలుసు. అయితే, ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉంటూ.. వికెట్లు తీయాలనే కసితో ఉన్నాడు. అతడు మా జట్టుకు పెద్ద బలం’ అని మెక్‌కలమ్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని