Brian Lara - Rashid Khan: రషీద్‌ ఖాన్‌ పెద్ద వికెట్‌ టేకర్‌ కాదు: లారా

ఆఫ్గనిస్థా్‌న్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడెలా బౌలింగ్‌ చేస్తాడో.. ఎలా వికెట్లు తీస్తాడో అందరికీ తెలిసిందే...

Published : 26 Apr 2022 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆఫ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడెలా బౌలింగ్‌ చేస్తాడో.. ఎలా వికెట్లు తీస్తాడో అందరికీ తెలిసిందే. అయితే, అతడేమీ పెద్ద ‘వికెట్‌ టేకర్‌ ’కాదని హైదరాబాద్‌ బ్యాటింగ్‌ కోచ్‌ బ్రయన్‌ లారా అన్నాడు. 2017 నుంచి గతేడాది వరకు హైదరాబాద్‌ తరఫునే ఆడిన రషీద్‌ ఈ సీజన్‌లో గుజరాత్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నీ చరిత్రలో వంద వికెట్లు తీసిన నాలుగో విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతడి బౌలింగ్‌పై స్పందించిన లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘రషీద్‌ఖాన్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ, అతడు లేకున్నా మా జట్టు కాంబినేషన్‌ అద్భుతంగా ఉంది. అతడి బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనవసరంగా రిస్క్‌ తీసుకోకూడదని భావించి ఆడతారు. అంతే కానీ, అతనేదో పెద్ద వికెట్లు తీసే బౌలర్‌ కాదు. అతడి ఎకానమీ సుమారు ఆరు. అది మెరుగ్గా ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి స్పిన్నర్‌కు తొలి ఆరు ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశం ఇస్తే అతడు కూడా మంచిగా బౌలింగ్ చేస్తాడు. ఇప్పుడు వాషింగ్టన్‌ స్థానంలో సుచిత్‌ కూడా బాగా ఆడుతున్నాడు. ఇక ఇప్పటి వరకు మేం ప్రతి మ్యాచ్‌లోనూ నలుగురు ఫాస్ట్‌ బౌలర్లతోనే బరిలోకి దిగాం. అలాగే మా రిజర్వ్‌ బెంచ్‌ కూడా చాలా బలంగా ఉంది. అయితే, రషీద్‌ మా జట్టులో ఉంటే మరింత బాగుండేది. ఈ పాటికి మేం ఆడిన ఏడు మ్యాచ్‌లూ గెలిచేవాళ్లమేమో’ అని లారా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని