బుమ్రాకు.. 5 సెకన్లు చాలు!

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసరని పాక్‌ మాజీ క్రికెటర్‌‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్‌మెన్‌ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. దేహభాషలో కాకుండా అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని...

Published : 02 Jan 2021 00:34 IST

ఈ స్మార్ట్‌ పేసర్‌కు కావాల్సింది కాస్తంత కండబలమే అంటున్న అక్తర్‌

ఇంటర్నెట్‌: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసరని పాక్‌ మాజీ క్రికెటర్‌‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్‌మెన్‌ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. దేహభాషలో కాకుండా అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని వివరించాడు. కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే అతడు బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించేస్తాడని వెల్లడించాడు. సీనియర్‌ పేసర్లైన ఇషాంత్‌, షమి, ఉమేశ్‌ లేకున్నా అతడు బౌలింగ్‌ దాడి అద్భుతమని కొనియాడాడు.

‘ప్రస్తుతం జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసర్‌. ఒకప్పుడు మహ్మద్‌ ఆసిఫ్‌ను ఎలా ఎదుర్కోవాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అయితే ఏబీ డివిలియర్స్‌ ఏడ్చినంత పనిచేశాడు. ఆసిఫ్‌ తర్వాత బుమ్రా అలా కనిపిస్తున్నాడు. టెస్టు క్రికెట్లో అతడి ఫిట్‌నెస్‌పై కొందరికి సందేహాలున్నాయి. నేనూ అతడిని దగ్గరుండి పరిశీలిస్తున్నాను. అతడు వేగంగా పుంజుకుంటాడు. బుమ్రాది చక్కని మూర్తిమత్వం’ అని అక్తర్‌ అన్నాడు.

‘బుమ్రా దూకుడు అతడి దేహంలో కాకుండా బంతి లెంగ్త్‌లో కనిపిస్తుంది. ఆ లెంగ్త్‌తోనే అతడు బ్యాట్స్‌మెన్‌ను ఓడిస్తాడు. అతడు చాలా మంచోడు. కానీ బంతి వేసేందుకు ఐదు సెకన్ల ముందు లెంగ్త్‌ ద్వారా తన దూకుడేంటో చూపిస్తాడు. నువ్వు నా కన్నా మెరుగైనవాడివి కాదని సవాల్‌ చేస్తాడు. తన బౌలింగ్‌ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చుతుంది. అతడు జట్టు మనిషి. చక్కని ఫాస్ట్‌ బౌలర్‌. మ్యాచ్‌ విజేత. అతడికి కాస్త కండబలం మాత్రమే అవసరమని నా ఉద్దేశం. ఆసియాకప్‌లో హార్దిక్‌ పాండ్యకూ ఇదే విషయం చెప్పాను. ఈ విషయంలో రవిశాస్త్రీ నాతో ఏకీభవించాడు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
కోహ్లీసేన.. 2021లో మారాలిక!
మానసిక ఇబ్బందుల్లో స్మిత్‌..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని