Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు..
టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టంచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత
ఇంటర్నెట్‌డెస్క్: టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టంచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
భారత్ - ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగుతోన్న విషయం తెలిసిందే. గతేడాదే ఈ సిరీస్ ప్రారంభమవ్వగా.. కొవిడ్ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజాగా జరుగుతోన్న ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 68 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటివరకు ఈ సిరీస్‌లో బుమ్రా తన ఖాతాలో 21 వికెట్లు సాధించాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా అధిగమించాడు. భువీ 2014లో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఐదో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్ ఇంకా మిగిలి ఉండటంతో బుమ్రా ఖాతాలో మరిన్ని వికెట్లు పడగొట్టే అవకాశముంది.
ఇంగ్లాండ్ టెస్టు సీరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
బుమ్రా : 21 వికెట్లు (2021-22)
భువనేశ్వర్ కుమార్ : 19 వికెట్లు (2014)
జహీర్ ఖాన్ : 18 వికెట్లు (2007)
ఇషాంత్ శర్మ : 18 వికెట్లు (2018)
సుభాష్ గుప్తా : 17 వికెట్లు (1959)
ఐదో టెస్టులోనే బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్‌కు బుమ్రా చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 35 పరుగులు రాబట్టి టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 2003లో (దక్షిణాఫ్రికా బౌలర్ పీటర్సన్) ఓవర్లలో 28 పరుగులు చేయగా.. బుమ్రా ఆ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా.. రోహిత్ శర్మ కొవిడ్ బారినపడటంతో ఈ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్‌లో అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్‌పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!